టాలీవుడ్ సీనియర్ బ్యాచిలర్ గోపీచంద్ పెళ్ళికూడా అయిపోవడంతో, ఆస్థానానికి ఏకైక ప్రతినిధిగా  ప్రభాస్ మిగిలాడు. తన కంటే చిన్న వాళ్ళు జూనియర్ ఎన్టీర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోయినా ఈ ఆరడుగుల అందగాడు పెద్దగా పట్టించుకోలేదు కారణం తన కంటే పెద్ద వాడైన గోపీచంద్ ఉన్నాడు కదా అని అనుకుంటూ వచ్చాడు, కానీ ఇప్పుడు గోపీచంద్ కు కూడా పెళ్ళి అయిపోవడంతో పాపం ఒంటరివాడు అయ్యాడు ప్రభాస్.

 ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాను అంటే ఆడపిల్లలు అందరూ క్యూకడతారు. కానీ ఆ అవకాశంలేదు ప్రస్తుతానికి. ప్రభాస్ పెళ్ళి చేసుకుందామనుకున్నా రాజమౌళి ఒప్పుకోడు. పెద్దపెద్ద గడ్డాలు, మీసాలతో ఉన్న ప్రభాస్ ఈ గెటప్ నుండి బయట పడటానికి కనీసం మరొక సంవత్సరం పైన పడుతుంది. ప్రస్తుతం గుర్రపుస్వారీ, కత్తి యుద్దాలు తప్ప పెళ్ళి యోగం కనుచూపుమేరలో కనిపించడం లేదు. ‘మిర్చి’ సినిమా సూపర్ హిట్ తో టాలీవుడ్ నంబర్ వన్ గా అయ్యాడో లేదో ప్రభాస్ కు తెలియదు కాని, ప్ర్రస్తుతం సీనియర్ మోస్ట్ బ్యాచలర్ పదవి మాత్రం ప్రభాస్ దే, అప్పటి వరకూ అమ్మాయిలకు ఆశ పెడుతూనే ఉంటాడు ప్రభాస్.....    

మరింత సమాచారం తెలుసుకోండి: