ఇటు ఇండ‌స్ట్రీ, అటు అభిమానుల్లో సెట్స్ పైకి వెళ్లకుండానే భీభ‌త్సమైన అంచ‌నాలు క్రియేట్ చేస్తోన్న చిత్రం బాహుబలి. దాదాపు 80 కోట్లతో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కనున్న ఈ సినిమాకు సంబందించి ప్రతి చిన్న విష‌యం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతోంది. ఇప్పటికే యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్, అనుష్క, రానా ఈ సినిమా కోసం క‌త్తి స్వాము, గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఫోటోస్ నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.
దీంతో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంటూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు అంతా. అయితే లెటెస్ట్ న్యూస్ ఏంటంటే బాహుబ‌లి ప్రీ ప్రొడ‌క్షన్ కి ఇంకా కాస్త టైం ప‌ట్టే అవ‌కాశం వుండ‌టంలో ఓపెనింగ్ జూన్ కి వాయిదా వేశార‌ట‌. నిజానికి ఈనెల‌14న బాహుబలి ప్రారంభోత్సవం అంటూ మీడియాలో వార్తలు వ‌చ్చాయి. మూవీ యూనిట్ కూడా అదే మాట చెప్పింది. కానీ ఇలా వాయిదా ప‌డేస‌రికీ ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహ ప‌డుతున్నారు. కానీ ఏది చేసినా ప‌ర్ ఫెక్షన్ కోస‌మే రాజ‌మౌళి చేస్తాడు కాబ‌ట్టి....వాయిదా ప‌డ‌టం వ‌చ్చిన న‌ష్టమేమీ లేదంటున్నారు కొంద‌రు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: