యాభై సినిమాల మార్కును దాటేస్తున్నా న‌రేష్ డ‌బుల్ రోల్ చేసింది త‌క్కువే. సుడిగాడు సినిమాలో చేశాడ‌నుకోండి. కానీ.. దానికి అంత ప్రాధాన్యం లేదు. తొలిసారి పూర్తి స్థాయిలో ద్విపాత్రిభిన‌యం చేస్తున్నాడు. జంప్ జిలానీ సినిమాలో. స‌త్తిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమా ఇది. త‌మిళంలో హిట్ట‌యిన క‌ల‌గ‌ల‌ప్పు అనే సినిమాకి రీమేక్ ఇది.

ఇందులో న‌రేష్‌ది డ్యూయ‌ల్ రోల్‌. ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు స్థానం ఉంది. వారి కోసం ఇప్పుడు వేట మొద‌లైంది. త్వ‌ర‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. న‌రేష్‌, స‌త్తిబాబు క‌ల‌యిక‌లో ఇది వ‌ర‌కు బెట్టింగ్ బంగార్రాజు, య‌ముడికి మొగుడు సినిమాలొచ్చాయి. ఇవి రెండూ ఓ మోస్త‌రుగానే ఆడాయి. మూడోసారైనా హిట్ కొడ‌తారో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: