ప్రముఖ గాయ‌ని గీతామాధురి పెళ్లికూతుర‌వుతోంది. త్వర‌లో త‌ను ప్రేమించిన న‌టుడు నందుతో పెళ్లీ పీట‌లెక్కనుంద‌నే ఓ వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్కర్లు కొడుతుంది. ఇంత‌కీ ఈ ఆనంద కృష్ణ నందు ఎవ‌రంటారా? న‌ందు ..ఈ   పేరు అంత‌గా తెలియ‌కున్నా ఫేస్ అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఫోటో, హండ్రెడ్ ప‌ర్సెంట్ ల‌వ్  సినిమాల‌తో పాటు  కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో న‌టించాడు ఇత‌గాడు.
 నిజానికి ఆ షార్ట్ ఫిల్మ్ ప‌రిచ‌యమే గీతాను నందు ప్రేమ‌లో ప‌డేలా చేసింద‌ట‌. ఈ ఇద్దరూ క‌లిసి నటించిన అధితి ట్రైల‌ర్స్ ఇప్పటికే నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. చెప్పుకోవాల్సిన మ‌రో విష‌యం ఏంటంటే గ‌తంలో హీరోయిన్ గా  చాన్స్ లు చాలా వ‌చ్చినా అంగీక‌రించ‌ని గీతామాధురి నందుపై ప్రేమ‌తోనే ఈ షార్ట్ ఫిల్మ్ చేసింద‌ని ఓ టాక్. నిప్పులేనిదే పొగ రాదంటారు. మ‌రి ఈ గాలి వార్తలో నిజ‌మెంత‌...? ఒక‌వేళ నిజ‌మే అయితే గీతాతో నందు మ్యారేజ్ ఎప్పుడో ...ఆ  సింగర్ క‌మ్ బ్యూటీ చెబితేనే బాగుంటుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: