ప్రిన్స్ కి కోపం వ‌చ్చింది. తెర‌పై త‌ప్ప  ఎప్పుడు కూల్ వుండే మ‌హేష్  ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. మ‌రి కూల్ గ‌య్ గరంగ‌రం అయింది ఎవరిపైనో తెలుసా....? వ‌ర్సటైల్ డైరెక్టర్ సుకుమార్ పై. ఖ‌లేజా సినిమా చాలా ఆల‌స్యం కావ‌డంతో త‌న కెరీర్ లో మ‌ళ్లీ ఇపుడు జ‌ర‌గ‌కూడద‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. అందుకే ఆ సినిమా త‌రువాత ద‌ర్శకులకు అదే మాట చెప్పాడ‌ట‌.
అందుకే  పూరి జ‌గ‌న్నాద్ బిజినెస్ మేన్ , శ్రీనువైట్లతో  చేసిన దూకుడు ఎప్పుడు మొద‌ల‌య్యాయో...ఎప్పుడు పూర్తయ్యాయో తెలీనంత‌గా వేగంగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాయి. కానీ ఇపుడు సుకుమార్ డైరెక్షన్ లో న‌టిస్తున్న సినిమా సంవ‌త్సరం కావొస్తున్న  ముప్పై శాతం షూటింగ్ కూడా పూర్తవ్వలేద‌ట‌. సుకుమార్ చాలా స్లోగా  షూటింగ్ చేస్తున్నాడ‌ట‌.  అంతేకాక షూట్ చేసిన సీన్స్ నే మ‌ళ్లీ మళ్లీ రీ షూట్ చేస్తున్నాడ‌ట‌. ప‌ర్ ఫెక్షన్ పేరు చెబుతూ  టైమ్ అంతా తినేస్తున్నాడ‌ట‌. సో ఎలా చూసినా ఈ సినిమా నెక్ట్స్ ఇయ‌ర్ సంక్రాంతికి త‌ప్ప ఇప్పట్లో విడుద‌ల‌య్యే అవ‌కాశం లేద‌ట‌.  దీంతో సుకుమార్ పై ఓ ద‌శ‌లో ప్రిన్స్ ఫైర్ అయిన‌ట్టు స‌మాచారం. డైరెక్షన్ నేర్చుకోవ‌డం కోసం ఈ సినిమా చేస్తున్నావా అని డైరెక్ట్ గానే అడిగాడ‌ట‌.
కానీ మీ కెరీర్ లో ది బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాల‌నే నా త‌ప‌న అని సుకుమార్ అనేస‌రికీ ప్రిన్స్ ఐస్ అయిపోయాడ‌ట‌. అయితే ఈ  ఫైర్స్, ఐస్ గోల మాకేందుకుగానీ సినిమాను త్వర‌గా ఫినిష్ చేయండి బాబూ అంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: