టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజ‌ల్ కు ఓ తీర‌ని కోరిక వుంద‌ట‌. ఇంకా చెప్పాలంటే  అదే తన డ్రీమ్ అంటోంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌ర‌స ఆఫ‌ర్లతో దూసుకుపోతున్న కాజ‌ల్ కి తీర‌ని కోరిక ....అదీ సినిమాల విష‌యంలో అంటే ఆశ్యర్చంగా వుందా..? కానీ ఇది నిజం.
కాజ‌ల్ కు  ఎప్పటినుంచో  యాక్షన్ సినిమాలు చేయాల‌నే కోరిక వుంద‌ట‌. యాక్షన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోని లేడీ అమితాబ్ అనిపించుకున్న విజ‌యశాంతి స్టైల్లో..... అరుంద‌తి, రాణీ రుద్రమ‌లో అనుష్క చేస్తోన్న పాత్రలు  త‌నూ చేయాల‌ని ఉవ్విళ్లూరుతోంద‌ట‌. అర్జంటుగా యాక్షన్ సినిమాలు చేయాల‌ని త‌హ‌త‌హాలాడుతోంది.
కానీ ప్రతి డైరెక్టర్ త‌న‌కు గ్లామ‌ర్ ఓరియెంటెడ్ రోల్స్  ఇస్తున్నార‌ని డిస్సాపాయింట్ అవుతూ ..త‌నకు యాక్టింగ్ ప‌వ‌ర్ చూపించే ఆ ఛాన్స్ ఎప్పుడోస్తుందోనంటూ ఆశ‌గా ఎదురుచూస్తోంది.  అయితే ఈ మ‌ద్య కాస్త  బొద్దు అయి  ఆఫ‌ర్లు త‌గ్గడంతో  ....ఇలా యాక్షన్ సినిమాలు చేస్తాన‌ని కాజ‌ల్  క‌టింగ్ ఇస్తోంద‌ని  ఫిల్మ్ న‌గ‌ర్ వాసులు అంటున్నారు. మ‌రి రెండింటిలో ఏది నిజ‌మంటారు...?
 

మరింత సమాచారం తెలుసుకోండి: