ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్......ఈ పేరు చెబితే కోట్లాది అభిమానుల గుండెలు ఓ   ఉద్వేగంతో  ఉప్పొంగుతాయి. అత‌డు తెర‌పై క‌నిపిస్తే అభిమానుల చ‌ప్పట్లతో ధియేట‌ర్లు ఊగిపోతాయి. నిజానికి మా అన్నయ్య అని చిరంజీవి కంటే ప‌వ‌న్ ని  అభిమానించే వారే ఎక్కువ‌. చిరు బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినా ...తొలి ప్రేమ‌, ఖుషీ, జ‌ల్సా,గ‌బ్బర్ సింగ్ ...పేరేదైనా..ప‌వ‌న్ స్టైల్, మేన‌రిజానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప‌వ‌న్ ని ప‌వ‌ర్ స్టార్ చేశారు.
నిజానికి ఆ బిరుదు సినిమాల్లో ప‌వ‌న్ స్టైల్, యాక్టింగ్ క‌న్నా , రియ‌ల్ లైఫ్ లో ప‌వ‌న్ రియ‌లిజాన్ని ...ప‌వ‌నిజాన్ని చూసి ఇచ్చారు. ప‌వ‌న్ అప్పుడు ..ఇప్పుడు..ఎప్పుడు కూడా నేను ఓ హీరో అని బిల్డప్ ఇవ్వడు. సాదాసీదాగా మ‌న ప‌క్కింటి అబ్బాయిలా...మ‌న ఇంట్లో వ్యక్తిలా క‌నిపిస్తాడు. అందుకేనేమో ప‌వ‌న్ అంత ద‌గ్గర‌య్యాడు అఖిలాంద్ర ప్రేక్షకులకు. ఇపుడు ప‌వ‌నిజాన్ని తెలిపే కొన్ని ఫోటోస్ నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తూ ప‌వ‌ర్ స్టార్ నిజంగానే రియ‌ల్ హీరో అని మ‌రోసారి ప్రూవ్ చేశాయి.
పవ‌న్ కొత్త సినిమా లోకెష‌న్ లోనివి ఈ ఫోటోగ్రాఫ్స్. త‌నంటే విప‌రీత‌మైన అభిమానం వున్న ఓ వ్యక్తి షూటింగ్ కి వ‌స్తే ద‌గ్గర కూర్చో పెట్టుకోని  కొబ్బరిబొండాం తాగిస్తున్న ఈ ఫోటోస్ చూస్తే ఫ్యాన్స్ అంటే ప‌వ‌న్ కి ఎంత అభిమాన‌మో....ఎంత నిరాడంబ‌రంగా  వుంటాడో తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: