త‌మ‌న్నా ఒంపుసొంపులు చూసి ఎవ‌రైనా ఫిదా అయిపోవ‌ల్సిందే. ఆమె అందానికి దాసోహం కావాల్సిందే. క‌థానాయ‌కులు సైతం... మాకు త‌మ‌న్నానే కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. మా ఫేవ‌రెట్ కో స్టార్‌.. త‌మ‌న్నా అని కితాబు ఇచ్చేస్తున్నారు. మ‌రి త‌మ‌న్నాకు ఎవ‌రంటే ఇష్టం??  ఇదే విష‌యంపై ఆమె స్పందించింది.

ఎప్ప‌టిలా నేను ప‌నిచేసిన అంద‌రూ బెస్టే.. అని చెప్పకుండా మ‌రో కొత్త పేరు బ‌య‌ట‌పెట్టింది. త‌నెవ‌రో కాదు.. హృతిక్ రోష‌న్‌. అవును.. త‌మ‌న్నాకి హృతిక్ అంటే భ‌లే ఇష్ట‌మ‌ట‌. అత‌ని డాన్స్‌లు చూస్తే మ‌తిపోయేలా ఉంటాయ‌ట‌. ఈ విష‌యాలు త‌మ‌న్నానే చెప్పింది.

హృతిక్ బాడీ కూడా.. సూప‌ర్‌గా ఉంటుంద‌ని చెప్పింది. హృతిక్‌తో న‌టించే అవ‌కాశం రావాలేగానీ.. ఎట్టిప‌రిస్థితిల్లోనూ వ‌దులుకోను. ఎందుకంటే నేను ఆయ‌న ఫ్యాన్‌... అని తేల్చేసింది త‌మ‌న్నా. ఈ మాట విని తెలుగు హీరోలు ఎంత‌మంది ఫీల‌య్యారో?!

మరింత సమాచారం తెలుసుకోండి: