చాలాకాలం త‌ర‌వాత స‌మంత ట్విట్ట‌ర్ డ‌బ్బా తెరిచింది. కాసిన్ని సినిమా క‌బుర్లు పంచుకొంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా టైటిల్‌.. అత్తారింటికి దారేది.. అని డిక్లేర్ చేసేసింది. అంతేకాదండోయ్‌... స్వ విష‌యాలూ పంచుకొంది. ''పెళ్లికి తొంద‌రేం లేదు. అలాంటి సంగ‌తులేమైనా ఉంటే నేనే చెబుతా.. వెయిట్ చేయండి..'' అంది. కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేద‌ట‌. కార‌ణం ఏమిటి?  

అని అడిగితే 'చేతిలో ఉన్న‌వి పూర్తి చేయాలి క‌దా?' అంటోంది. స‌మంత కొత్త సినిమాలు ఒప్పుకోక‌పోవ‌డానికి కార‌ణం.. సిద్దూనే అని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చెప్పుకొంటున్నారు. ఎలాగూ పెళ్లిచేసుకోబోతున్నాం.. ఈ సినిమాల గోలేందుకు.. అని సిద్దూ చెప్పాడ‌ట‌. అదే ఇప్పుడు స‌మంత పాటిస్తోంది కాబోసు.

మరింత సమాచారం తెలుసుకోండి: