తన గ్లామర్ తో తెలుగు, తమిళ సినిమాలను ఒక ఊపు ఊపుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా ను హైదరాబాద్ టైమ్స్ ఆన్ లైన్ పోల్ లో “మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2012” సర్వే లో ప్రధాన స్థానంలో తమన్నా నిలుస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ వార్త తెలియగానే ఎవరైనా ఆనందంతో పొంగిపోతారు. రకరకాల బిల్ట్ అప్ లతో పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తారు. కాని దీనికి విరుద్ధంగా తమన్నా మాత్రం ఈ స్థానాలు శాశ్వతం కాదని, ప్రపంచం ఇప్పుడు ఏమి అంతం అవ్వదని వేదాంత ధోరణిలో మీడియాకు ప్రతి స్పందించింది.

 ఈ సంవత్సరం తను టాప్ గా వస్తే మరొక సంవత్సరం మరొకరు వస్తారు అని వేదాంతం చెపుతూ భగవద్గీత సారాంశం చెప్పడం అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా, ఇంత వేదాంత ధోరణిలో తమన్నా ఎందుకు ఉంది ..? అంటూ చర్చలు మొదలు పెట్టారు. అంతేకాదు ఇంత చిన్న వయసులో ఇంత వ్యరాగ్యం చెపుతోంది అంటే తమన్నా ఎక్కడైనా ఏమైనా పోగొట్టుకుందా..? అంటూ విపరీత అర్ధాలు తీస్తున్నారు.

గత కొద్ది నెలల క్రితం తమన్నా ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్న “హిమ్మత్వాలా” ఘోర పరాజయం షాక్ వల్ల ఈ మిల్కీ బ్యూటీ ఇలా మాట్లాడుతుందేమో అనుకోవాలి. కొత్త సినిమాలు ఇంక ఒప్పుకోను అని సమంత ప్రకటించిన నేపధ్యంలో ఈ వేదాంత ధోరణి నుండి తమన్నా బయట పడితే దక్షినాది సినిమాలలో ఆమె టాప్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమన్నా ఈ వేదాంత ధోరణిలో ఎంత కాలం ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: