మ‌న టాలీవుడ్ లో వేశ్య పాత్రల‌కు మళ్లీ డిమాండ్ వ‌చ్చేసింది. ఎప్పుడూ లేనంత‌గా హీరోయిన్స్ వేశ్య పాత్రలు చేయ‌డానికి ఊవ్విళూరుతున్నారు. నిజానికి వేశ్య పాత్రలు   ఆడియెన్స్ కేం  కొత్తకాదు. మ‌హాన‌టి సావిత్రి మొద‌లు స‌హ‌జ‌న‌టి జ‌య‌సుద వ‌ర‌కు....అల‌నాటి అంజ‌లి మొద‌లు నేటి అనుష్క దాకా వేశ్య  పాత్రలంటే ఎగిరిగంతేసినవాళ్లే.   న‌టించి మెప్పించిన‌వాళ్లే.
అయితే  అప్పటి సంగ‌తి ప‌క్కన పెడితే  ఇపుడు స‌మ్మర్ లోనూ  ప్రేక్షకుల‌కు  వేశ్యా వినోదం క‌ల‌గ‌నుంది. జ‌నార్ధన్ మ‌హార్షి డైరెక్షన్ లో  శ్రేయ వేశ్య పాత్రలో న‌టించిన ప‌విత్ర,     టెన్త్ క్లా్ ఫేం చందు డైరెక్షన్ లో   ఛార్మి   న‌టించిన ప్రేమ ఒక మైకం , హ‌రిప్రియ వేశ్యగా న‌టించిన అబ్బాయి క్లాస్..అమ్మాయి మాస్ రెండు రెండు, మూడు వారాల గ్యాప్ లో వ‌రుస‌గా విడుద‌ల కానున్నాయి. మ‌రి వేశ్యపాత్రని  ముగ్గురిలో ఎవ‌రు మ‌హ‌బాగా పండించారో తెలియాలంటే జ‌స్ట్ వెయిట్ అండ్ సీ..............
 

మరింత సమాచారం తెలుసుకోండి: