చాలామంది మ‌న‌లో ఒక‌టి కాబోయి మ‌రోక‌టి అయ్యామ‌ని చెబుతుంటారు. సేమ్ వే పొడుగుకాళ్ల  సుందిరి దీక్షాసేత్ డాక్టర్ కాబోయి యాక్టర్ అయింద‌ట‌. ప్రజెంట్ ఆఫ‌ర్లేమీ  లేని ఈ సుంద‌రిని కాస్త కదిలిస్తే  చాలు  చైల్డ్ హుడ్ లోని ఎన్నో ఇంట్రెస్టింగ్  ధింగ్స్  పూస గుచ్చుతుంది. క్లాస్ లో ఎప్పుడు ముందు (ముందు బెంచీలో...చదువులోకాదు) వుండే ఈ  నాటీగ‌ర్ల్ టెన్త్ అవ్వగానే ఆర్కియాల‌జీ చ‌దువాల‌నుకుంద‌ట‌. కానీ తండ్రి కాద‌న‌డంతో అన్నింట్లో కాంప్రమైజ్ అయ్యేద‌ట‌.
ఇక అమ్మడు ఇంట‌ర్ కొచ్చేస‌రికీ దీక్షా ప్రేమ లేఖ‌లు ఎన్నో అందుకుంది.అంతేకాదు ప్లీజ్ ల‌వ్ మీ బ్యాచ్ లో ఒక అబ్బాయి న‌చ్చినా.....దాదాపు డిగ్రీ పూర్తయ్యే వ‌ర‌కు అత‌డు చూస్తుంటే ..చూడ‌టం త‌ప్ప    ఫియ‌ర్ తో త‌న ప్రేమ‌ను చెప్పలేక‌పోయింద‌ట‌. కానీ ఇపుడు అవ‌న్ని గుర్తోస్తుంటే భ‌లే ధ్రిల్ గా వుంద‌ని సెల‌విస్తుంది.
అయితే ప్రస్తుతం సినిమాలేనీ ఈ భామ చిన్నప్పటి విష‌యాలు కాక ఇంక ఏం చెప్పుతుందిలెండి అంటున్నారు కొద్దిమంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: