యోగా బ్యూటి అనుష్క కోరికను రాజమౌళి కాదన్నాడు, కోరిక ఏమిటి అని అనుకుంటున్నారా. అయితే ఇది చదవండి తెలుగులో  తమకు తామే డబ్బింగ్ చెప్పే హీరోయిన్ల సంఖ్య గతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటోంది దాదాపు అసలు లేరనే చెప్పవచ్చు.  టాలీవుడ్ లో బాంబే హీరోయిన్ల దిగుమతి బాగా పెరిగిన తరువాత అందరు హీరోయిన్లు డబ్బింగ్ మీదనే ఆధార పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటివలి కాలంలో నయనతార తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పి చాలామందికి ఆదర్శంగా నిలిచింది. తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలన్నది నయనకు  చిరకాల కోర్కె. ఆ కోరికను చాలాకాలం పాటు అణచుకుని ఎట్టకేలకు ” కృష్ణం వందే జగద్గురుం ” సినిమాతో నెరవేర్చుకుంది. అలాంటి కోరిక ఉన్న మరో హీరోయిన్ అనుష్క.

 నటిగా తన సత్తా ఏమిటో ఇప్ల్పటికే నిరూపించుకున్న అనుష్క తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం అనుష్క ‘బాహుబలి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని తన మనసులోని మాటను రాజమౌళి కి చెప్పిందట. అయితే అనుష్కకు, రాజమౌళి  నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది.

 ఇంత భారీ చిత్రంలో ఇటువంటి ప్రయోగాలు చేస్తే…. పొరబాటున అవి బెడిసి కొడితే తరువాత బాధ పాడేందుకు కూడా అవకాశం వుండదనుకున్నాడో, ఏమో రాజమౌళి అనుష్క కోరిక విని సమాధానం ఏమి ఇవ్వలేదట. అయితే తాను హీరోయిన్ గా నటిస్తున్న సెల్వ రాఘవన్ తమిళ సినిమా తెలుగు అనువాదంలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని తన సత్తా ఏమిటో రాజమౌళి కి తెలియచేయాలని అనుష్క భావిస్తున్నట్టు భోగట్టా. ఏమయినా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడానికి అనుష్క పడుతున్నతాపత్రయం ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: