45 సంవత్సరాలు దాటిపోయినా చెక్కు చెదరని అందం ఆమె సొంతం చాలా సంవత్సరాల క్రితం తన చోళీ కింద ఏముంది అంటూ, ఆ నాటి కుర్రకారు ని రేచ్చకోట్టిన అందాల రాసి ఆమె. ఆరోజులలో చోళీకే పీచే పాటతో ఆమె నృత్యం చేస్తుంటే అలనాటి యూత్ పూనకం వచ్చినట్లు ఊగిపోయార ఆమె ఎవరో కాదు మాధురీ దీక్షిత్. ప్రస్తుతం ఈమె తన అందమైన గాగ్ర గురించి ప్రస్తావిస్తూ తనకంటే వయస్సులో చిన్న వాడైన రణబీర్ కపూర్ తో తన అందాలు చిందిస్తూ ఐటమ్ సాంగ్ ‘హేజవానీ హైదివానీ’ సినిమా కోసం చిందులు వేస్తుంటే షూటింగ్ స్పాట్ లో ఉన్న వాళ్ళంతా మాటరాక ఆశ్చర్య పోయారట.

 బాలీవుడ్ సినిమాల డ్రీమ్ బాయ్ రణబీర్ కూడా ఆమె డాన్స్ చేస్తుంటే సరిజోడుగా అడుగులు వేయడానికి చాలా కష్టమైనదట. దశాబ్దం క్రితం పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్ళిపోయి పిల్లలు పుట్టిన తరువాత ఈ మధ్య ఇండియాకు తిరిగి వచ్చి తిరిగి తన సత్తాను మాధురీ ఈ పాట ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు తన గ్లామర్ ఏమిటో చూపెట్టబోతోంది. అందుకే నిర్మాతలు కూడా మారుమాట్లాడకుండా ఒకేఒక్క పాటకు కోటి రూపాయలు ఇస్తున్నారు. ట్విస్ట్ ఏమిటంటే ఐటమ్ సాంగ్స్ ను చేయను అని చెప్పిన మాధురీ  ‘హేజవానీ హైదివానీ’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం కోటి రూపాయల మహిమ.... 

మరింత సమాచారం తెలుసుకోండి: