అందం, చందం - న‌ట‌న గిటన అన్నీ తెలిసిన క‌థానాయిక ఛార్మి. గ్లామ‌ర్ పాత్ర‌లు వ‌చ్చినంత కాలం అవి చేసింది. త‌గ్గాక క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల‌వైపు ఓ లుక్కేసింది. అలాంటి సినిమాల్లో రాణించి త‌న‌లోని న‌టిని సంతృప్తి ప‌ర‌చుకొంది. అవార్డులు కైవ‌సం చేసుకొంది. అవి త‌గ్గాక ఐటెమ్ పాట‌ల్లోకి దిగింది. అక్క‌డా జోరుగా చిందేసింది. మ‌రో క‌థానాయిక‌కు డ‌బ్బింగ్ చెప్పింది.

గెస్ట్ రోల్ కూడా ఒప్పుకొంది. ఇలా తెలుగు సినిమాల్లో టాప్ టూ బోట‌మ్ ట‌చ్ చేసింది ఛార్మి. ఇప్పుడు ప్రేమ ఒక మైకం సినిమాలో వేశ్య‌గా న‌టించ‌నుంది. త్వ‌ర‌లో మ‌రోసారి బాలీవుడ్ త‌లుపు త‌డ‌తా.. అని చెబుతోంది. అక్కడి నుంచి మ‌ళ్లీ ఓ అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. ఈ యేడాది త‌న కెరీర్ బాగుంటుంద‌ని చెబుతోంది. అన్న‌ట్టు ఈ రోజు ఛార్మి బ‌ర్త్‌డే. హ్యాపీ బ‌ర్త్‌డే టూ ఛార్మీ

మరింత సమాచారం తెలుసుకోండి: