రేపిస్టులు తీవ్ర‌వాదుల కంటే దారుణం! ఢిల్లీలో జ‌రిగిన నిర్భ‌య సంఘ‌ట‌న గురించి తెలుసుకొన్న‌వారంతా.. ఇదే మాట చెప్పారు. ఇప్పుడు ఆర్‌.నారాయ‌ణ మూర్తి అదే అంశాన్ని తెర‌పై చూపిస్తున్నారు. ద‌ర్శ‌క నిర్మాత‌గా నారాయ‌ణ‌మూర్తి 25వ సినిమా నిర్భ‌య భార‌తం. అత్యాచారాల‌ను ఖండిస్తూ, రేపిస్టుల‌కు మ‌ర‌ణ దండ‌న విధించాల్సిందే అనే నినాదంతో తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఇటీవ‌ల ఢిల్లీలో కొన్ని కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించారు. దాంతో చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్టే.  

త‌ప్పు చేసిన వాడికి శిక్ష ప‌డాల్సిందే అని చెబుతున్నాం. ఈ సినిమా చూశాక‌.. త‌ప్ప‌కుండా అందిలో మార్పు వ‌స్తుంది అని చెబుతున్నారు నారాయ‌ణ మూర్తి. ఆగ‌స్టు 15న ఈ సినిమా విడుద‌లయ్యే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: