పంజాబీ పిల్ల ఛార్మీ  తనకు ఇంకా పాతిక సంవత్సరాలేనని చెబుతోంది.  నిజం చెప్పు ఛార్మి అంటే, నేను నిజమే చెబుతున్నానండి బాబు అంటూ ఓ కొత్త లెక్క తో క్లారిటీ కూడాఇస్తోంది . తను పదమూడేళ్ళ వయసులో సినిమాల్లోకి వచ్చాననీ, పన్నెండేళ్ళుగా ఇక్కడ ఉన్నాననీ అంటూ, పాతిక్కి సరిపడా లెక్కలు చెప్పింది.

 అయితే ఇప్పటి దాకా వయసుకి మించిన పాత్రలు చేశాననీ, ఇక నుంచి మాత్రం వయసుకి తగ్గా పాత్రలు మాత్రమే చేస్తాననీ అంటోంది. స్లిమ్ గా కనిపించడానికి  డైట్ చేస్తూ, జిమ్, స్విమ్ చేస్తూ వారానికి రెండు కిలోల చొప్పున తగ్గుతుందట. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్... చార్మి. "మంత్ర", "మంగళ", "అనుకోకుండా ఒక రోజు"  చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

ఈ ముద్దుగుమ్మ తాజాగా  ఆమె మల్లిక అనే వేశ్యగా  ‘ప్రేమ ఒక మైకం’ సినిమాలో కనిపిస్తుంది."ఈ మల్లికకు మనసు పుడితేనే నీ దగ్గరకు వస్తుంది" అంటూ ఘాటైన డైలాగులు చెప్పబోతోంది. ఆ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కథానాయికగా పన్నెండేళ్ళ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇకపై మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో నటించబోతున్నానని చెప్పుకొచ్చింది.

ఈరోజు తన ఇరవై ఆరో పుట్టిన రోజును జరుపుకుంటున్న ఛార్మి  గురువారం విలేఖరులతో మాట్లాడింది.తన పెళ్లి గురించి మాట్లాడుతూ... "నాక్కొంచెం తిక్కుంది. నా తిక్కను భరించేవాడు వచ్చేదాకా ఎదురుచూస్తాను. నన్ను మార్చకుండా తనే నాకు అనుగుణంగా మారేవాడే నాకు భర్తగా రావాల"ని కోరుకుంది. మరి ఈ తిక్కమ్మకు సరితూగే తిక్క మొగుడు ఎక్కడున్నాడో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: