అందరు కడుపుబ్బ నవ్వించే కమెడియన్లు, అందుకు తగ్గ హీరో నవీన్, నిండు గోదావరి లాంటి హీరోయిన్ కమలిని ముఖర్జీ, సంగీతంతో ఉర్రూతలూగించే మణిశర్మ లాంటి సంగీత దర్శకుడు ఉండడంతో కాసేపు హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేయవచ్చని సినిమాకు వెళ్లిన ప్రేక్షకులతో రామా.. రామా.. ఇదేమి గోల అనుకునేలా చేసింది రామాచారి సినిమా.

బాద్ షా లాంటి ఫైట్లు, గగుర్పొడించే సన్నివేశాలు, ఢాంఢాం అనే పేళుల్లు, బుల్లెట్ల వర్షం తో  సినిమా అంతా ఉత్కంఠ ఉంటుందా అని తెగ సంబరిపడిపోతాడు సినిమా ఆరంభాన్ని చూసి. తీహార్ జైలు, కరడు గట్టిన ఉగ్రవాది, ముఖ్యమంత్రిని హతమార్చడానికి ప్లాన్ వంటి వాటితో మొదలయిన సినిమా కొన్ని క్షణాలు కాకముందే దానినంతా కామెడి చేసి తుస్సుమనిపించారు.

హీరో తండ్రి చంద్రమోహన్, మామ ఎల్.బి. శ్రీరాం, మరో పోలీసు అధికారిగా వేణు బావ పాత్రలో బ్రహ్మానందం, పోలీస్ ఐజిగా గిరిబాబు, దొంగగా అలీ వంటి వారిని పెట్టి ఏమాత్రం నవ్వించలేక పోయారు. చక్కటి నవ్వులు పుట్టించే డైలాగులు ఉన్నప్పటికి వాటిని సరైన తీరులో ప్రజెంట్ చేయలేక చతికల బడ్డారు డైరెక్టర్.

హీరోయిన్ అరగేంట్రం నుంచి మొదలుకొని హీరోతో ప్రేమలో పడే వరకు హీరో, హీరోయిన్ల మద్య నడిపించిన కథ అట్టర్లీ ప్లాప్. అసలు కథేంటి, సినిమా ఎటువైపు వెలుతోంది, ఏం జరుగుతుంది అన్నదేది తెలియకుండా సినిమాను సాగదీసి పేలవంగా ముగించారు. మణిశర్మ లాంటి సంగీత దర్శకుడు ఉండి కూడా ఒక్క పాట వినసొంపు లేదు, కనీసం తెరపై చూసే విదంగా కూడా లేకుండా చిత్రీకరించి చీత్కరించుకునేలా సినిమా తీసారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: