జ‌న‌ర‌ల్ గా మ‌న ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హీరోకు ఎంత ఏజ్ వున్నా ప‌ర్లేదు. కానీ హీరోయిన్ కు మాత్రం రెండు ప‌దుల వ‌య‌స్సు దాటొద్దు. అందుకే టాలీవుడ్ టు బాలీవుడ్ అర‌వై ఏళ్లు వ‌చ్చినా మ‌న హీరోలు ప‌ద‌హారేళ్ల పాప‌తోనే చిందేస్తారు. అయితే త‌న కంటే చిన్నవాడైన హీరోతో జ‌త‌క‌ట్టి ప్రేక్షకుల్ని మెప్పించే హీరోయిన్స్ మ‌న ప‌రిశ్రమ‌లో చాలా అరుద‌నే చెప్పాలి.
కానీ చెన్నై చంద్రం త్రిష మాత్రం ఆ క్రెడిట్ కొట్టేసింది. శింబుతో ఈ సుంద‌రి క‌లిసి న‌టించిన విన్నైతాండి వ‌రువాయా( ఏమాయ చేసావెకు త‌మిళ వ‌ర్షన్) సూప‌ర్ హిట్ అన్న సంగ‌తి అంద‌రికీ తెల‌సిందే. ఈ సినిమాలో ఈ జంట కెమిస్ట్రీ కుర్రకారుకి కిర్రెక్కించింది. ప్రస్తుతం త్రిష త‌మిళంలో మ‌రోసారి త‌న కంటే ఒన్ ఇయ‌ర్ జూనియ‌ర్ అయిన జీవాతో క‌లిసి న‌టిస్తోంది. వ‌య‌స్సులో త‌న‌కంటే చిన్నవారితో  ఆ సినిమా హిట్టేన‌ని త్రిష న‌మ్ముతోంది.  అంతేకాదు త‌న కంటే ఏజ్ త‌క్కువ వాళ్లతోనే  రోమాంటిక్ సీన్స్ చాలా బాగా చేయ‌గ‌ల‌న‌ని  సెల‌విస్తుంది. ప్రస్తుతం పెద్దగా సినిమాలేమీ లేని ఈ సుంద‌రి త‌న కంటే చిన్నోడిని(జీవా) న‌మ్ముకుంది.  మ‌రి త్రిష ఏజ్ సెంటిమెంట్ మ‌ళ్లీ వ‌ర్క్ ఔట్ అవుతుందో లేదో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: