బాలీవుడ్ హాట్ భామ వీణామాలిక్ దృష్టి ఇప్పుడు రాజ‌కీయాల‌పై ప‌డింది. ఎపుడో ఒక‌ప్పుడు తాను కూడా పాలిటిక్స్‌లో దిగి ప్ర‌జాసేవ చేస్తా.. అంటోంది. చిన్న‌ప్ప‌టి నుంచీ... రాజ‌కీయాంటే ఆస‌క్తి ఉంద‌ట‌. త‌న మన‌స్త‌త్వం రాజ‌కీయాల‌కు అతికిన‌ట్టు స‌రిపోతుంది.. అని చెప్తోంది. అయితే ఇప్ప‌ట్లో ఆశ నెర‌వేర‌ద‌ట‌. దానికి ఇంకొంచెం స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. ఈలోగా త‌న దృష్టి పూర్తిగా సినిమాల మీదే అంటోంది.

అన్న‌ట్టు వీణా మాలిక్ న‌టించిన జింద‌గీ 50-50 త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో తాను ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఉన్న హాట్ భామ‌ల స్థానాల‌ను కొల్ల‌గొడ‌తా అని దీమాగా చెబుతోంది. ఈ సినిమా తెలుగులో రంగీలాగా రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: