డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది  ఫై రకరకాల వార్తలు వస్తున్నాయి సుకుమారుడుసినిమా  ఘోర పరాజయానికి ఇతడే కారణం అంటూ మీడియా లో రాతలు కూడా వస్తున్నాయి . వివరాలలోకి వెళ్ళితే  ఇప్పటివరకూ ఈ హీరో చేసింది మూడు సినిమాలే అయినా అప్పుడే దర్శకుడిపై పెత్తనం చలాయిస్తున్నాడ ని టాక్  .అంతే కాదు ఈ  యంగ్ హీరో ఆదికి దూకుడు ఎక్కువయిందని ఇండస్ట్రీలో వార్తలు విన్పిస్తున్నాయి. తొలి సినిమాతో 'ప్రేమకావాలి' అంటూ ముందుకు వచ్చి లవ్‌లీతో సెకండ్‌ చిత్రం చేసేసరికి మూడో చిత్రానికి ట్రెండ్‌ మార్చేశాడంటున్నారు. 

'సుకుమారుడు' చిత్రానికి దర్శకుడు అశోక్. ఈ దర్శకునికే క్లాస్‌ పీకుతూ ఆ సీన్ ఇలా చేయాలి ఈ సీన్ అలా చేయాలంటూ... కొన్ని సీన్స్‌ చేశాడని చెప్పుకుంటున్నారు. దీంతో కథంతా మారిపోయి గందరగోళంగా తయారైందట సుకుమారుడు . దర్శకుడు అశోక్‌పై నమ్మకంతో 10 కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే...సినిమా మొత్తం  హీరోకి వదిలేయడమేమిటనిఈ సినిమా నిర్మాత దర్శకుడికి  చీవాట్లు పెట్టినట్లు భోగట్టా. ఏదేమైనా చేతులు కాలా క ఆకులు  పట్టుకుంటే ఉపయోగం ఏముంది ?

మరింత సమాచారం తెలుసుకోండి: