``నాకు న‌చ్చిందే చేస్తా. మ‌న‌సుకు ఏది అనిపిస్తే అదే మాట్లాడ‌తా. పెళ్లి చేసుకోవాల‌ని ఎప్పుడు అనిపిస్తే అప్పుడే చేసుకొంటా..`` అని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడుతోంది ఛార్మి. ``పెళ్లి గురించి ప్రత్యేకంగా ఏమీ అనుకోలేదు. ఈ యేడాది లేన‌ట్టే. అలాగ‌ని వ‌చ్చే యేడాది చేసుకొంటానని ఇప్ప‌డే చెప్ప‌లేను..`` అని తెలివిగా మాట్లాడేస్తోంది.

దేవిశ్రీ ప్ర‌సాద్ తో లింకులు వేసి క‌థ‌నాలు రాస్తుంటారు. దీనిపై మీ స్పంద‌న ఏమిటి? అని అడిగితతే ``చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అంద‌రితోనూ నేను క్లోజ్‌గా ఉంటా. దేవితో మ‌రింత క్లోజ్‌గా ఉంటా. అందుకే అలా రాస్తుంటారు. ఎన్నిసార్లు చెప్పినా.. అదే అదే రాస్తున్నారు. నేను మాత్రం ఏం చేయాలి..??`` అని వాపోతోంది.

ఛార్మి న‌టించిన ప్రేమ ఒక మైకం త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. ఈ సినిమా త‌కు కెరీర్‌లో గుర్తిండిపోయే స్థాయిలో ఉంటుంద‌నే భ‌రోసాలో ఉంది ఛార్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: