సంజ‌య్ ద‌త్ ఆశ‌ల‌న్నీ అడియాశ‌లు అయ్యాయి. కోర్టు క‌నిక‌రించ‌లేదు. ఎన్ని పిటీష‌న్లు వేసినా... అవ‌న్నీ చెత్త బుట్ట‌లోకి వెళ్లిపోయాయి. దాంతో లొంగిపోక త‌ప్ప‌లేదు. జెల్లో ఇప్పుడు అడుగుపెట్టినా... మాన‌సికంగా ఎప్ప‌టి నుంచో శిక్ష అనుభవిస్తున్నాడు సంజ‌య్ ద‌త్‌. అత‌ని రాక మ‌ళ్లీ మూడున్న‌రేళ్ల త‌ర‌వాతే!  సంజ‌య్ జైలు కెళ్ల‌డంతో కొన్ని సినిమాలు ఆగిపోయాయి. దీని వ‌ల్ల బాలీవుడ్‌కి క‌నీసం 150 కోట్లు న‌ష్ట‌మని అంచ‌నా వేస్తున్నారు. ఎందుకంటే మూడేళ్ల త‌ర‌వాత‌.. ఆగిపోయిన సినిమాని మ‌ళ్లీ మొద‌లు పెట్టే ఛాన్స్ త‌క్కువ‌. అప్పుడు సంజూకి ఇమేజ్ ఉంటుందో లేదో ఎవ‌రికి ఎరుక‌. సంజూ సినిమా ఇన్నింగ్ప్‌కి ఇక్క‌డితో పుల్‌స్టాప్ ప‌డిన‌ట్టే అని బాలీవుడ్ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

జైల్లోనూ మున్నాభాయ్‌కి క‌ష్టాలు త‌ప్పేట్టు లేవు. ఎందుకంటే సంజూకి విధించిన‌ది క‌ఠిన కారాగార శిక్ష‌. పావలా, అర్థ‌రూపాయ‌ల‌కు కూడా పాచి ప‌నిచేయాలి. పాపం... ఎలా నెట్టుకొస్తాడో. ఇన్నాళ్లూ ఏసీ గ‌దుల్లో విలాస‌వంత‌మైన జీవితం గ‌డిపిన సంజూకి క‌ష్టాలు మొద‌లైన‌ట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: