ఈ మాట మేం చెప్ప‌డం లేదు. గ‌ణాంకాలే చెబుతున్నాయి. ఈ యేడాది రామ్‌చ‌ర‌ణ్ (నాయ‌క్‌), మ‌హేష్‌బాబు (సీత‌మ్మ వాకిట్లో....) సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇవి రెండూ ఒకొక్క కేంద్రంలో వంద రోజులు ఆడాయి. ప్ర‌భాస్ మిర్చి సినిమా ఏకంగా 28 సెంట‌ర్ల‌లో వంద రోజులు పండుగ చేసుకోబోతోంది. అంటే... టాలీవుడ్ హీరోల్లో ప్ర‌భాస్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అనే క‌దా??  లాభాల ప‌రంగా చూసినా మిర్చినే బెస్టు. నాయ‌క్‌, సీత‌మ్మ‌ల బ‌డ్జెట్‌... రూ50 కోట్లు దాటేసింది.

మిర్చి మాత్రం రూ.30 కోట్ల‌తో పూర్త‌య్యింది. నాయ‌క్‌, సీత‌మ్మ‌కు వ‌చ్చిన లాభాల‌కంటే మిర్చికి వ‌చ్చిందే ఎక్కువ‌. త్వ‌ర‌లోనే మిర్చి 100 రోజుల వేడుక హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. రెబ‌ల్ స్టార్ అబిమానుల‌కు ఆరోజు పండ‌గే.

మరింత సమాచారం తెలుసుకోండి: