త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘అత్తారింటికి దారేది’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఒక పాట పాడనున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే గతంలో కొన్ని సినిమాల్లో పాటలు పాడాడు. ఈ పాటలు మెగా అభిమానులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో పాట పాడుతుండటంతో అందరి దృష్టి దానిపై ఉంది.

కాగా, ఈ సినిమాలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తుండగా, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: