రాయంచ‌...ఈ పేరు మీరు పురాణాల్లో మీరు వినే వుంటారు. రాయంచ అనేది ఓ అమ్మాయి పేరు. ఆమె ఓ అద్బుత సుంద‌రి. ఆ బ్యూటీ చూపు సోకితేనే యుద్దం లేకుండా శత్రువులు పాదాక్రాంతుల‌య్యేవార‌ట . ఇపుడు ఆమె వార‌స‌త్వం మ‌న బాలీవుడ్ బ‌క్కప‌ల్చని సుంద‌రి దీపికాకు వ‌చ్చింద‌నుకుంటా.. ఎందుకంటే ఆమె చూపుకే బి టౌన్ లో ఎవ‌రైనా బౌల్డ్ అయిపోతున్నార‌ట‌.
నిజానికి దీపికా సినిమాల కంటే ఎఫైర్స్ తో వార్తల్లో వుండే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. మొద‌ట బాలీవుడ్ రాక్ స్టార్  ర‌ణ‌బీర్ క‌పూర్,  త‌రువాత ధోని, ఆ త‌రువాత సిద్దార్ధ మాల్యా ..ఇలా చాలామందితో  అమ్మడు డేటింగ్ చేసింది.  ఇపుడు  ఈ బ్యూటీ చూపుకి ర‌ణ‌వీర్ సింగ్ బౌల్డ్ అయ్యాడు.ప్రస్తుతం దీపికా మాజీ ప్రియుడు ర‌ణ‌బీర్ క‌పూర్ తో  యే జ‌వానీ హై దీవాని సినిమా చే్స్తూనే....మ‌రోవైపు కొత్త  ప్రేమికుడు ర‌ణ‌వీర్ సింగ్ తో  చెట్టా ప‌ట్టాలేసుకోని తిరుగుతూ రోమాన్స్ చేస్తోందట‌.
విశేషం ఏంటంటే ఈ మ‌ద్య మీడియా మీరు ఇన్ని ఎఫైర్స్ పెట్టుకోవ‌డానికి కార‌ణం ఏంట‌ని అడిగితే....నాకు న‌చ్చిన మ‌గాడు కోస‌మే ఈ అన్వేష‌ణ ..ఈ ఎఫైర్స్  అన్నద‌ట‌.  దీంతో స‌రైన మ‌గాడి కోసం ఓ అమ్మాయి అనేక ఎఫైర్ల క‌ధ‌తో ...రాయంచ రియ‌ల్ ల‌వ్ స్టోరి అని ఓ సినిమాను తీస్తే ఎలా వుంటుంద‌రి కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. ఇంకొద్దిమంది ఆ సినిమాలో దీపికానే హీరోయిన్ బాగుంటుంద‌ని సెటైర్స్ వేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: