మనలో ప్రతి ఒక్కరికి ఎదో ఒక బలహీనత ఉంటుంది, అయితే చాలా మంది ఆబలహీనతలను చెప్పుకోవడానికి ఇష్టపడరు. అందుకే వీలైనంత వరకూ రహస్యంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తారు. బాలీవుడ్ లో ప్రస్తుతం అమ్మాయిల మనసులను దోచుకునే రాజకుమరుడిగా పేరున్న రణబీర్ కపూర్ కు కూడా కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలను అతడి మాజీ ప్రేయసి దీపికా పడుకునే ఈమధ్య బయట పెట్టింది.
రణబీర్ కు బొద్దింకలు అన్నా, సాలీడు పురుగులు అన్నా చాలా బయమట, సామాన్యంగా ఇవి కనిపించగానే ఎవరైనా చంపడానికి ప్రయత్న్నిస్తారు. కానీ రణబీర్ మాత్రం వీటిని చూసి దాక్కుంటాడట. ఆదృశ్యం చూసి తాను చాలా ఆశ్చర్య పడ్డానని దీపిక చెప్పింది. అంతేకాకుండా ఈ అందగాడికి ఫోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉందనీ సామాన్యంగా ఎదో ఒక వయస్సులో మగవాళ్ళు అందరూ ఇటువంటి వీడియోలు చూస్తూనే ఉంటారని దీపిక సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది. వీరిద్దరూ నటించిన ‘హేజవనీ హైదివానీ’ ఈ నెల 31న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రణబీర్ మాధురీ దీక్షిత్ తో చేసిన స్పెషల్ సాంగ్ ఎంతటి సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిన విషయమే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: