త్రిష మళ్లీ తన సత్తా చాటింది. వయస్సు మీద పడుతున్నా తన క్రేజ్ ఏమాత్రం తగ్గ లేదని నిరూపించుకుంది. కొత్త సినిమాలో నటించేందుకు భారీ పారితోషం తీసుకుంటూ వార్తల్లోకి వచ్చింది. త్రిష కొత్త చిత్రంలో నటించేందుకు తన కెరియర్ లోనే భారీ పారితోషకం తీసుకుంటూ తన క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతుందని చెప్పింది.

ఒక కొత్త చిత్రం లో నటించేందుకు ఏకంగా కోటి ఆరవై లక్షల రూపాయిలు తీసుకుంటూ త్రిష అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తమిళ దర్శకుడు పాండ్యన్ దర్శకత్వంలో పీవీఆర్ రాజు నిర్మిస్తున్న చిత్రం కోసం త్రిష ను హీరోయిన్ గా ఎన్నుకున్నారు. ఇందుకోసం ఆమెకు కోటి ఆరవై లక్షల రూపాయిలు చెల్లిస్తున్నారు. త్రిష కెరియర్ ముగింపు దశకు చేరుకుంటుందని అభిప్రాయాలు  వస్తున్న తరుణంలో త్రిష మాత్రం భారీ పారితోషకం తీసుకుంటూ వార్తల్లోకి వచ్చింది.

కాగా,  ఈ కొత్త సినిమాలో త్రిష తో పాటు పూనమ్ బాజ్వా, ఓవియా కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: