మ‌హేష్‌బాబు జోరుమీద ఉన్న మాట వాస్త‌వ‌మే. ఆయ‌న నుంచి కొత్త సినిమా క‌బుర్లు వినిపిస్తున్నాయి. కానీ ఏ సినిమా ఫైన‌లేజ్ అవ్వ‌డం లేదు. క్రిష్ తో శివం అన్నారు. ఆ త‌ర‌వాత వంశీపైడి ప‌ల్లి సినిమా అన్నారు. రాజమౌళి తో జ‌త క‌డుతున్నారు అని చెప్పారు. అయితే.. ఈ సినిమాపై స్వ‌యంగా మ‌హేష్‌బాబుకీ క్లారిటీ లేదు. ఏ సినిమాకి ఓకే చెప్పాలో తెలీక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఇప్పుడు రాజ్ డికె ద్వ‌యం పేరు కూడా వినిపిస్తోంది.

అయితే.. ప్రిన్స్ ఇంకా ఓ నిర్ణ‌యానికి రావ‌డం లేదు. సుకుమార్‌, ఆగ‌డు... సినిమా ఫ‌లితాల‌ను బ‌ట్టే త‌ర‌వాతి సినిమాకి ఒకే చెప్పే అవ‌కాశాలున్నాయి. అందుకే మ‌హేష్ ఎవ‌రికీ నో చెప్ప‌డం లేదు. అలాగ‌ని చేస్తా అని మాట కూడా ఇవ్వ‌డం లేదు. ఈ దాగుడు మూత‌లు ఎన్నాళ్లో మ‌రి.?

మరింత సమాచారం తెలుసుకోండి: