రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘బలుపు’. గోపిచంద్ మలినేని దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాపై రవితేజ ఎన్నో ఆశలతో ఉన్నాడు. వరుస ఫ్లాపులతో ఉన్న తనను ‘బలుపు’ ఒడ్డున పడేస్తుందని రవితేజ నమ్మతున్నాడు. కాగా, ఈ సినిమాలో శృతిహాసన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుంది. ప్రముఖ హీరోయిన్ లక్ష్మీరాయ్ కూడా బలుపు సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. లక్ష్మీరాయ్ ‘బలుపు’ సినిమాకు కొత్త ఆకర్షణ తెస్తుందని చిత్ర యూనిట్ అంటుంది.

పివిపి సినిమా పతాకంపై నిర్మిస్తున్న  ఈ బలుపు సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకురానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: