ఒక‌ప్పుడు వ‌రుస విజ‌యాల‌తో టాప్ డైరెక్టర్ అనిపించుకున్న తేజ ప్రస్తుతం ఒక్క హిట్ దొరికిన చాలు అనే సిట్యూయేష‌న్ ఫేస్ చేస్తున్నాడు. అందులో బాగంగా  వెయ్యి అబ‌ద్దాలు ఆడైనా స‌రే ఒక హిట్ కొట్టాల‌ని ప్లాన్ చేస్తున్నాడు.  నిజానికి ఆ  మ‌ద్య వ‌చ్చిన తేజ ప్రతి సినిమా ప‌ర‌మ రోటీన్. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమింకోవ‌డం.. ఆ ఇద్దరూ పెద్దల్ని ఎదురించి  అడ‌వుల్లోకి పారిపోపోవ‌డం.. ఆ త‌రువాత ఎండింగ్ విల‌న్ గారు హీరోని చిత‌క్కోట్టడం..అప్పుడు హీరోయిన్ పాట పాడేస‌రికీ హీరో లేచి విల‌న్ ని చంపేయ‌డం .ఇలాంటి క‌ధ‌ల‌తో తేజ రావ‌డం ఫ్లాప్ ఎదుర్కోవ‌డం జ‌రిగింది.
అందుకే    ఈ సారి  త‌న చెత్త క‌ధ‌ల్ని కాకుండా కొత్తగా  స‌మ‌కాలీన అంశాల‌తో  వెయ్యి అబ‌ద్దాలు తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. విశేషం ఏంటంటే పూరి జ‌గ‌న్నాద్ త‌మ్ముడు సాయిరాం శంక‌ర్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో మాజీ గ‌వ‌ర్నర్  ఎన్.డి.తివారి సెక్స్ స్కాం సీన్స్ కూడా పెట్టాడ‌ట‌.
గ‌తంలో ఆంద్రప్రదేశ్ గ‌వ‌ర్నర్ గా పనిచేసిన తివారి ఎంత ర‌సికుడో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న రోమాన్స్ సీన్స్ ఓ ఛాన‌ల్ బ‌య‌ట‌పెట్టడం...ఆయ‌న‌ను కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుండి సాగ‌నంపే సీన్స్ అన్ని ఈ సినిమాలో పెట్టిన‌ట్టు స‌మాచారం.  మ‌రి ఆ సీన్స్ అయినా 1000 అబ‌ద్దాల్ని బాక్సాఫీస్ ద‌గ్గర స‌క్సెస్ అయ్యేలా చేస్తుందో లేదో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: