జంజీర్ సినిమా వెన‌క్కి వెళ్ల‌డంతో రామ్‌చ‌ర‌ణ్ బాగా ఫీల‌య్యాడు. ఈ మ‌ధ్య‌లో ట్రాఫిక్ లో జ‌రిగిన ర‌చ్చ‌, ర‌చ్చ చ‌ర‌ణ్‌కి త‌ల‌నొప్పి తెచ్చిపెట్టింది. క‌నీసం ఎవ‌డు సినిమా అయినా పూర్తి చేద్దాం అంటే.. ఆ ప‌నుల‌న్నీ ముక్కుతూ మూలుగుతూ అవుతున్నాయి. దాంతో చ‌ర‌ణ్ బాగా అప్‌సెట్ అయ్యాడ‌ట‌. దేవిశ్రీ ప్ర‌సాద్ ఆర్.ఆర్ అందించ‌డంలోనూ చాలా ఆల‌స్యం చేస్తున్నాడ‌ట‌.

ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్‌. కానీ టెక్నిక‌ల్ టీమ్ ... చ‌ర‌ణ్‌కి స‌పోర్ట్ చేయ‌డం లేద‌ని అత‌ని ఫీలింగ్‌. దిల్ రాజు కూడా త‌న పూర్తి కాన్స‌ట్రేష‌న్‌... రామయ్యా వ‌స్తావ‌య్యా మీదే పెట్టాడ‌ట‌. దాంతో ఎవ‌రికి చెప్పుకోవాలో అర్థం కావ‌డం లేద‌ట‌. ఈలోగా... కొత్త సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లిపోవాల‌ని డిసైడ్ అయ్యాడు. అందుకే కొర‌టాల శివ‌... సినిమాని ఇంత అర్జెంటుగా సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: