స‌మంత సినిమాల‌కు దూరం అవుతుందా?  చేతిలోఉన్న సినిమాలు పూర్తి చేసుకొని సైడ్ అయిపోతోందా?  ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. ఈయేడాది చివ‌ర్లో సమంత పెళ్లి చేసుకోనుంద‌ని కూడా చెప్పుకొన్నారు. అయితే వీట‌న్నింటినీ జెస్సీ తోసిపుచ్చింది. ఈయేడాది పెళ్లి చేసుకొనే ఆలోచ‌న లేద‌ని స్ప‌ష్టం చేసింది.

''చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నా. కొత్త సినిమాలే ఒప్పుకోలేని ప‌రిస్థితి ఇక పెళ్లి ఎక్క‌డ చేసుకొంటా..?  ముందు ఒప్పుకొన్న సినిమాలన్నీ పూర్తి చేయ‌నివ్వండి.. '' అంటోంది. అంటే ఈ సినిమాల్నీ పూర్త‌య్యాక వెంట‌నే పెళ్లి చేసుకొంటాన‌ని చెప్ప‌క‌నే చెప్పింది క‌దా?  

మరోవైపు తమిళంలోనూ కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవ‌డం లేదు స‌మంత‌. ఒక్కో సినిమానీ పూర్తి చేసి పెళ్లికి లైన్ క్లియ‌ర్ చేసుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేసినట్టుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: