ఆరెంజ్ తో తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌కరించిన సుంద‌రి షాజ‌న్ ప‌దంసీ. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో తెలుగులో  ప‌త్తా లేని ఈ బ్యూటీకి బాలీవుడ్ లో మాత్రం ఆఫ‌ర్లు బాగానే వ‌స్తున్నాయి . ఆ ఛాన్స్ ల సంగ‌తి ప‌క్కన‌పెడితే ఇపుడు ఈ బ్యూటీ త‌న అభిమానుల‌కు అక్షరాల లక్ష క‌మ్మని కౌగిలింత‌లు ఇచ్చేసిందండోయ్... అర్ధంకాలేదుక‌దా.....? అస‌లు విష‌యం ఏంటంటే షాజ‌న్ ట్విట్టర్ లో అకౌంట్ ఈ మ‌ద్యే తెరిచింది.
అలా తెరిచిన కొద్ది సేప‌ట్లోనే ఈ భామ‌ను ల‌క్షమంది ఫాలో అయ్యార‌ట‌. దీంతో ఈ బ్యూటీ త‌న ఫాలోయింగ్ కు తెగ సంబ‌ర‌ప‌డిపోతుంది. అంతేకాదు ట్విట్టర్ లో న‌న్ను ఫాలో అయ్యేవారి సంఖ్య లక్ష దాటేసింది. సో న‌న్ను ఫాలో అవుతున్న ఒక్కోక‌రికీ ఒక్కో కౌగిలింత చోప్పున లక్ష క‌మ్మని కౌగిలింత‌లు ఇస్తున్నానంటూ ట్విట్ పోస్ట్ చేసింది. నిజానికి ఈ అమ్మడి అందానికి  చాలా ఫాలోయింగ్ వున్నప్పటికీ ఆఫ‌ర్లు ఇచ్చేవారే కాన‌రావడం లేదు.
అయితే ప్రస్తుతం బోల్ బచ్చన్ తెలుగు రీమేక్ లో న‌టించే ఆఫ‌ర్ వెత్తుకుంటూ వ‌చ్చింది. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాస్త సంద‌డి చేసినా..... షాజ‌న్ పంట పండొచ్చు అని క్రిటిక్స్ అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: