ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ప్రస్తుతం రూపొందుతున్న ప్రతీ సినిమాలోనూ ఐటెం సాంగ్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. పైగా ఆ ఐటెం సాంగ్ ను భారీగా చిత్రీకరిస్తూ, ప్రచారం కూడా భారీగా నిర్వహిస్తున్నారు. ఇదే విషయం తాజాగా ‘షూట్ అవుట్ ఎట్ వాడాలా’ సినిమా విషయంలో జరుగుతుంది.

జాన్ అబ్రహం హీరోగా నటించిన సినిమా ‘షూట్ అవుగ్ ఎట్ వాడలా’. ఇటీవల విడుదలయ్యిన ఈ సినిమాలో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిది. అయితే సినిమా ప్రచారంలో ఆమెను మాత్రం పక్కన పెడుతున్నారు. ఈ సినిమాలో ఐటెం సాంగ్స్ లో నటించిన ప్రియాంక చోప్రా, సన్ని లియోన్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. చిత్ర హీరోయిన్ ను ప్రచారం లో పక్కన పెట్ట్టి ఐటెం గాళ్స్ పై ఎక్కువ ప్రచారం చేయడం ఇప్పుడు అందర్నీ ఎక్కువగా ఆకర్షిస్తుంది.

ఈ ఒక్క సినిమా మాత్రమే కాకుండా మిగిలిన సినిమాల విషయంలో కూడా ఇలానే జరగుతుండటం అందర్ని ఆలోచనలో పడవేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: