తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఓ పుస్పక విమానం. ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా ఓ సీటు ఖాళీగానే వుంటుంది. అందుకే ముంబాయ్ ,కేర‌ళ‌,అమెరికా .. స్టేట్ ఏదైనా ... కంట్రీ ఇంకేది అయినా  కొత్త అందం కనిపిస్తే ట‌క్కున ప‌ట్టేస్తారు మ‌న టాలీవుడ్ ద‌ర్శక నిర్మాత‌లు. ఇపుడు న‌టుడు, ద‌ర్శకుడు అడ‌వి శేషు మిస్ కెన‌డా ఫోటోజెనిక్ గా ఫేం అయిన ప్రియా బెన‌ర్జిని టాలీవుడ్ కి ప‌రిచ‌య చేస్తున్నాడు. కిస్ అనే సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించ‌బోతుంది. నిజానికి శేషు గతంలో  హీరోగా న‌టించిన క‌ర్మ సినిమాతోనూ ఓ కొత్త పాపను తెర‌పైకి తెచ్చాడు. ఇపుడు కెన‌డా నుండి కిస్ చేసేందుకు ప్రియాను ప్రియంగా ఆహ్వనించాడు.
ఇక టైటిల్ లోనే సినిమా క‌ధ ఏంటో అర్దమైపోతున్న కిస్ లో అడ‌విశేషు, ప్రియా బెన‌ర్జీ ఆన్ స్క్రీన్ రోమాన్స్ అదిరిపోయేలా వుంటుంద‌ని మూవీ యూనిట్ అంటోంది.  ఇప్పటికే రిలీజైన ట్రైల‌ర్స్, ఫోటోస్  చూసి శేషు మంచి ఫిగ‌ర్ నే ప‌ట్టాడ‌ని  కొంద‌రు అంటున్నారు  మ‌రి క‌ర్మ త‌రువాత పంజా, బ‌లుపు సినిమాల్లో విల‌న్ రోల్ చేసిన శేషు ఈ రోమాంటిక్ సినిమాతోనైనా కెరీర్ పుంజుకునేలా చేసుకుంటాడేమో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: