ఇద్దర‌మ్మాయిలతో సినిమా ఆగిపోవ‌డానికి చాలా రీజ‌న్స్ ఫిల్మ్ న‌గ‌ర్ లో వినిపిస్తున్నాయి. ఆగిపోవ‌డం  అంటే పూర్తిగా  కాదు...జస్ట్ పోస్ట్ పోన్ అయింది. మ‌రి నెల రోజులుగా ఎందుకు బ‌న్నీ ఇద్దర‌మ్మాయిల‌తో ప్రేక్షకుల ముందుకు రాలేక‌పోతున్నాడు ...ఆర్ధిక స‌మ‌స్యలా...? అబ్బే ప్రొడ్యుస‌ర్ బండ్ల గ‌ణేష్. బ్లాక్ బస్టర్ కోసం వంద కోట్లైనా ఖ‌ర్చు పెట్టగ‌ల‌డు. మ‌రి రీజ‌న్ ఏంటి చెప్మా...అంటే ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్లో ఓ గ‌ట్టి రీజ‌నే దొరికింది.
అది ఏంటంటే ఇద్దర‌మ్మాయిల‌తో విడుద‌ల‌ను ఆపేసింది బ‌డా ప్రొడ్యుస‌ర్ ....బ‌న్ని ఫాద‌ర్ అల్లు అర‌వింద్ గార‌ట‌.  అదేంటి తండ్రే కొడుకు సినిమాను ఆపేశాడా అని షాక్ అవ్వకండి. ఎందుకంటే  సినిమా అంతా చూశాక 25 సీన్లు అల్లు అర‌వింద్ కి అస‌లు న‌చ్చలేద‌ట‌. రోమాన్స్ సీన్స్ మ‌రీ శృతి మించాయ‌ట‌. అలాగే బ‌న్నీతో పూరి చెప్పించిన చాలా డైలాగ్స్  అమ్మాయిల‌ను హ‌ర్ట్ చేసేలా వున్నాయ‌ట‌. దీంతో ఓ ఇర‌వై నుండి ఇర‌వై సీన్స్ రీ షూట్ చేయ‌మ‌ని ఆయ‌న చెప్పిన‌ట్టు గుస‌గుస‌. .
అయితే సినిమాను ఈనెల 24 నుండి 31కే మాత్రమే   పోస్ట్ పోన్ చేశారు . అంటే గ్యాప్ ఇచ్చింది వారం రోజులే. కాబ‌ట్టి వారం రోజుల్లో అన్ని రీషూట్ చేయ‌డం అసాద్యం. సో  రీషూట్ అన్నది గాసిప్ రాయుళ్లు  క్రియేట్ చేసినదే త‌ప్ప మ‌రోక‌టి కాదు. అంతేకాదు ఐపిల్ ట్వంటీట్వంటీ వ‌ల్లే సినిమాను పోస్ట్ పోన్ చేశార‌న్నదే రియ‌ల్ అండ్ ఫైన‌ల్ టాక్ .
 

మరింత సమాచారం తెలుసుకోండి: