యంగ్ హీరో నితిన్,  క్యూట్ గ‌ర్ల్  నిత్యమీన‌న్ ప్రేమ‌లో వున్నారా...? ఔన‌నే అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు. నిప్పు లేనిదే పొగ రాదుగా ...నితిన్ నిత్య ల మ‌ద్య  ఎఫైర్ న‌డుస్తుంది అన‌డానికి కూడా ఓ క‌ధ ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్కర్లు కొడుతోంది.  12 ఫ్లాప్స్ త‌రువాత ఇష్క్ తో హిట్ కొట్టిన నితిన్ ఆ సినిమా విజ‌యంతో పాటు నిత్య ప్రేమ‌ను ద‌క్కించుకున్నాడ‌ట‌. అందుకే గుండె జారి గ‌ల్లంత‌య్యిందే  సినిమాకు నిత్యనే హీరోయిన్ గా ఎంచుకున్నాడ‌ని కొద్దిమంది అంటారు. అయితే ఇపుడు ఆ కొద్దిమంది వాద‌న‌కు బ‌లం చేకూర్చే సంఘ‌ల‌న  మ‌రోక‌టి జ‌రిగింది.
అదేంటంటే ప్రస్తుతం నితిన్ కొరియ‌ర్ బోయ్ క‌ళ్యాణ్ అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో యామీ గౌత‌మ్ నితిన్ కి జోడిగా న‌టిస్తోంది. అయితే ఇష్క్, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే సినిమాల్లో నిత్య వుండ‌టం వ‌ల్లే క‌లెక్షన్స్ బాగా వ‌చ్చాయని...ఈ సినిమాకు కూడా నిత్యనే క‌ధానాయిక‌గా తీసుకోమ‌ని ప్రొడ్యుస‌ర్ గౌత‌మ్ మీన‌న్ ని  నితిన్ కోరాడ‌ట‌.
అయితే ఆల్ రెడీ యామీ గౌత‌మ్ తో కొన్ని సీన్స్ తీశాక‌....ఇపుడు మద్యలో నిత్య అంటే ఎలా...? మీ మ‌ద్య ఏదైనా రిలేష‌న్ వుంటే బ‌య‌ట పెట్టుకోండి సినిమా విష‌యంలో వ‌ద్దు అంటూ గౌత‌మ్ చిన్న పాటి క్లాస్ పీకాడ‌ని స‌మాచారం. మ‌రి ఫిల్మ్ న‌గ‌ర్ లో వినిపిస్తున్న నితిన్, నిత్య  ల‌వ్ క‌హానిలో నిజమెంతో కాల‌మే నిర్ణయించాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: