నయనతారతో తన లవ్ బ్రేకప్ అయిన తరువాత దర్శకుడు ప్రభుదేవా ఏమాత్రం విరామం తీసుకోకుండా తన కొత్త ప్రేయసిగా మలయాళీ ముద్దుగుమ్మఅసిన్ ను ఎంచుకున్నాడు, అంతేకాదు ప్రస్తుతం వీరు పీకలలోతు ప్రేమలో పడిపోవడమే కాకుండా హ్యాపీగా కెనడాలో గడిపి వచ్చారనీ, వార్తలే కాకుండా తరుచు వీరిద్దరు పార్టీలలో,పబ్బుల్లో కలిసి కనిపించడం మీడియాకు హాట్ న్యూస్ గా మారడమే కాకుండా వీరిద్దరి మధ్యా డేటింగ్ నడుస్తోంది అనడానికి ఇవే ఆధారాలు అంటూ రాతలు వస్తున్నాయి.

బాలీవుడ్ టాప్ సినిమాలలో నటించిన అసిన్ ప్రస్తుతం తనకు ఎక్కువగా బాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో తన దృష్టిని తన మాతృ స్థానమైన కోలీవుడ్ పై పెట్టి అక్కడ అవకాశాలు వెతుక్కుంటూ పనిలోపనిగా టాలీవుడ్ పై కూడా ఒక కన్నేసి చూస్తోంది. కానీ మన హీరోలు అసిన్ ను పట్టించుకోవడం లేదు అది వేరే విషయం అనుకోండి, ఇక ప్రభుదేవా ఇంత తొందరగా, ఇంత గాడంగా అసిన్ ను ప్రేమిమచడానికి గల కారణం తన మాజీ ప్రేయసి నయనతారను ఏడిపించడానికా లేక వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ నడుస్తోందా అనే విషయం రాబోయే కాలం తేల్చాలి

మరింత సమాచారం తెలుసుకోండి: