మ‌న‌లో చాలామందికీ తెలిసిన సామెత‌....ఆరు నెల‌లు క‌లిసి వుంటే వాళ్లు వీళ్లు అవుతార‌ని. ఇపుడు త్రివిక్రమ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సహావాసాన్ని చూస్తుంటే సామెత అక్షరాల నిజ‌మే అని త‌ల ఊపక త‌ప్పదు. జ‌ల్సా సినిమాకి క‌ల‌సి ప‌నిచేసిన ఈ ఇద్దరూ ఆ సినిమాతో బెస్ట్ ప్రెండ్స్ అయ్యార‌ట‌. నిజానికి ప‌వ‌న్ అంత ఈజీగా ఎవ‌రికీ క్లోజ్ అవ్వడు . కానీ త్రివిక్రమ్ స్డడీ, బిహేవియ‌ర్, అన్ని కూడా అత‌డిపై ప‌వ‌న్ లో ఒక స్పెష‌ల్ ఇమేజ్ ని క్రియేట్ చేశాయి. అంతేకాదు జ‌ల్సా    మూవీ త‌రువాత ప‌వ‌న్ లైఫ్ లో కొన్ని ప‌ర్సన‌ల్ ప్రాబ్లమ్స్ ని త్రివిక్రమే ద‌గ్గర వుండి సాల్వ్ చేశాడ‌ట‌. అప్పటినుండి ఈ ఇద్దరూ ఇంకా  ధిక్ ప్రెండ్స్ అయిపోయార‌ట‌. ఎంత‌గా అంటే ఇపుడు  ప‌వ‌న్ సినిమాల్ని త్రివిక్రమే ఫైన‌లైజ్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. .
ఎంత పెద్ద డైరెక్టర్ అయినా త్రివిక్రమ్ క‌ధ ఓకే చేశాకే సినిమాను ఎనౌన్స్ చేయాల‌ట‌.. అంత‌వ‌ర‌కు బాగానే వుందిగానీ,అంద‌రూ ప‌వ‌న్ ని స్టైల్ , యాటిట్యూడ్ ని ఇష్టప‌డుతుంటే ప‌వ‌న్ మాత్రం త్రివిక్రమ్ ని అన్ని విష‌యాల్లో ఫాలో అవుతుండ‌ట‌మే అంద‌రిలో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. . న‌మ‌స్తే చెప్పే స్టైల్ ద‌గ్గర నుండి త్రివిక్రమ్ వేసుకునే క‌ల‌ర్ ష‌ర్ట్స్ వేసుకునే వ‌ర‌కు ప్రతిదీ ఫాలో అవుతున్నాడు ప‌వ‌ర్ స్టార్. విశేషం ఏంటంటే ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న అత్తారింటికీ దారేదీ సినిమా షూటింగ్ కు ప్రతిరోజూ ఒకే డ్రస్ తో అటెండ్ అవుతున్నార‌ట‌.  ఆ విష‌యం ఈ ఫోటోస్ చూస్తే అర్దమైపోతుంది కూడా. మ‌రి ఇంత‌గా ప‌వ‌న్ స్టార్ త్రివిక్రమ్ ని ఫాలో అవ్వాల్సిన అవ‌స‌రం ఏంటో ఆ ఇద్దరికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: