మాస్ మహారాజా రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న సినిమా ‘బలుపు’. గోపించద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమలో శృతిహాసన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, ఈ సినిమా ఆడియోను జూన్ 1న హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. హెచ్.ఐ.సి.సి సెంటర్ జరిగే ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు.

తన కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా రవితేజ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. గతంలో అగ్రహీరోలకు దీటుగా రవితేజ సినిమాలకు వసూళ్ళు వచ్చేవి. అయితే ఇప్పుడు అతని సినిమాలకు పెట్టుబడి కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘బలుపు’ తనకు పూర్వ వైభవం తెస్తుందని రవితేజ చాల నమ్మకంగా ఉన్నాడు.

లక్ష్మీరాయ్ ఐటెం సాంగ్ లో నటిస్తున్న ీఈ సినిమాలో అడవి శేష్, ప్రకాష్ రాజ్, బ్రహ్మనందం, జయప్రకాష్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: