‘ఇద్దరు అమ్మాయిలతో’  సినిమా బన్నీని టెన్షన్ పెడుతోందా?జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమే అని అని పిస్తోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల ఆలస్యానికి రక రకాల కారణాలు బయటకు వస్తున్నాయి. వరుసగా కొన్ని పరాజయాలు చవిచూసిన దశలో బన్నీ  జాగ్రత్తపడి చేసిన 'జులాయి'తో అల్లు అర్జున్‌కి కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ హిట్‌ దక్కింది. అయితే ఆ వెంటనే ఫామ్‌లో లేని పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో నటించడానికి సాహసించాడు. తనకి కావాల్సినట్టుగా అన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా, కానీ ఫైనల్‌ ప్రోడక్ట్‌ మాత్రం తాను అనుకున్నట్టుగా రాలేదని బన్నీ డిజప్పాయింట్‌ అయ్యాడట.

జులాయి తర్వాత మరో విజయం వస్తే హీరోగా తనకి ఎంత ప్లస్‌ అనేది బన్నీకి బాగా తెలుసు. అందుకే చాలా కీలకమైన ఈ  'ఇద్దరమ్మాయిలతో' చిత్రంపై అతను చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే ఈ చిత్రానికి చివరి నిముషంలో ప్యాచ్‌ వర్క్‌లు చేస్తున్నారని, ఇంకా షూటింగ్‌ జరుగుతూనే ఉందని, ఫిలింనగర్‌ టాక్‌. ఈ కారణాలవల్ల  చిత్రం రిలీజ్‌ లేట్‌ అవుతోంది కానీ. ఐపీఎల్ క్రికెట్ అన్నది కారణం కానేకాదు అని అంటున్నారు.

సమ్మర్ హాలిడేస్ లో అందరూ ఖాళీ గా ఉన్నారు కాబట్టి. ఇద్దరమ్మాయిలతోలాంటి పెద్ద సినిమా రావడానికి ఇదే మంచి తరుణం. కానీ పర్‌ఫెక్షన్‌ పేరిట చాలా టైమ్‌ వేస్ట్‌ అయిపోతోంది. దీని వల్ల సినిమాపై ఉన్న ఆశక్తి కూడా సన్నగిల్లుతోంది అన్న టాక్ వస్తోంది . ఈ సినిమా విడుదల ఆలస్యం మిగతా హీరో ల సినిమా విడుదల ఫై పడి టాలీవుడ్ సినిమా మార్కెట్ ను గజిబిజిగా మార్చిందని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు . పాపం బన్ని టైమ్ వేస్ట్ అవుతుందా అని అని అనిపిస్తోంది. అందుకే టెన్షన్ లో ఉన్నాడట బన్నీ...  

మరింత సమాచారం తెలుసుకోండి: