హైద‌రాబాదీ సోయగం దియామీర్జా పెళ్లికి రెడీ అయ్యింది. వ‌చ్చే యేడాది పెళ్లిచేసుకొంటున్నానోచ్ అని ప్ర‌క‌టించేసింది. చిర‌కాల ప్రియుడు సాహిల్ తో జీవితం పంచుకోబోతోంది. ''సాహిల్ మంచివాడు. నిజాయ‌తీ ప‌రుడు. మా ఇద్ద‌రి మ‌ధ్య దాప‌రికాలేం లేవు. త‌న‌తో నా జీవితం బాగుంటుంద‌ని న‌మ్ముతున్నా..'' అని చెప్పుకొచ్చింది. అంతే కాదు.. త్వ‌ర‌లోనే ఇద్ద‌రూ క‌లిసి ఓ సినిమా తీసే ఆలోచ‌న‌లో ఉన్నారు.

బాలీవుడ్‌లో స్థిర‌ప‌డిన దియా.. తెలుగులో ఓ చిత్రాన్ని రూపొందించ‌డానికి సన్నాహాలు చేస్తోంది. ఓ యువ క‌థానాయ‌కుడితో సినిమా ప్లాన్ చేస్తోంద‌ట‌. ఈ సినిమాలో తానే హీరోయిన్‌గా క‌నిపిస్తుంద‌ట‌. సొంత సినిమాతో అయినా తెలుగులో గుర్తింపు తెచ్చుకోవాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుంద‌న్న‌మాట‌. ఈ సినిమా పూర్త‌య్యాకే పెళ్లి చేసుకొంటా.. అని ఫినిషింగ్ ట‌చ్ కూడా ఇచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: