టాలీవుడ్ యంగ్ హీరోల అంద‌రితో న‌టించినా .... ల‌క్ కుద‌ర‌క బాలీవుడ్ లో అడుగుపెట్టి...శ్రీదేవి సినిమా( ఇంగ్లీష్ వింగ్లీష్) పుణ్యామాని మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చిన సుంద‌రి ప్రియా ఆనంద్. చూడ‌టానికి ఒంటిపై కేజీ కండ లేకున్నా యాక్టింగ్ ప‌ర్వాలేద‌నిపిస్తుంది ఈ బ్యూటీ. అందుకే ఇంగ్లీష్ వింగ్లీష్ త‌రువాత బాలీవుడ్ లో ఓ సినిమా...తెలుగులో మ‌రో రెండు సినిమాల‌కు సైన్ చేసింది. ఆ విష‌యం ప‌క్కన పెడితే ఈ భామ గురించి చెప్పుకోవాల్సిన మరో విశేషం వుంది. అదేంటంటే ఈ భామ‌కు ఏడు భాష‌ల్లో ప్రావీణ్యం వుంద‌ట‌. ఏడు బాష‌ల్లోనూ గుక్క తిప్పుకోకుండా మాట్లాడేయ‌గ‌ల‌ద‌ట‌.
ప్రస్తుతం వున్న హీరోయిన్స్ లో రెండు భాషలు వ‌చ్చిన‌వాళ్లు కూడా లేరు.. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అని చెప్పుకునే భామ‌ల‌కు తెలుగే స‌రిగా రాదు. అలాంటిది ప్రియా ఆనంద్ ఏకంగా ఏడు భాష‌ల్లో మాట్లాడ‌ట‌మంటే మాట‌లా..? గ‌్రేట్ క‌దా...? ఇదే విష‌యాన్ని ప్రియా ముందు వుంచితే....ఇందులో గొప్పేంముంది....తెలుగు, త‌మిళం, హిందీ, ఇంగ్లీష్,  బెంగాళీని చిన్న త‌నం నుండే నేర్చుకున్నాను. అందువ‌ల్లే ఆ ఐదు భాష‌ల్లో  అన‌ర్గలంగా మాట్లాడ‌తాను.ఇక  స్పానిష్ లాంగ్వేజ్ తో ప‌రిచ‌యం వుందిగానీ....ఆ భాష మొత్తంరాదు..కొన్ని బూతు మాట‌లు మాత్రమే తెలుసంది అమ్మడు. మ‌రి ఓ రెండు బూతు మాట‌లు మా చెవిన కూడా వేయోచ్చుక‌దా అంటే..నా బూతు మాటల‌కు చాలా అర్దాలు వుంటాయండోయ్ అంది ముసిముసిగా న‌వ్వుతూ. సో ఆడువారి మాట‌ల‌కు అర్దాలే వేరులే స్టైల్లో  ప్రియా బూతుల‌కు అర్దాలే వేరు అన్నమాట‌.
 

మరింత సమాచారం తెలుసుకోండి: