హీరోయిన్ అవ్వాలంటే అందం వుండాలి..కానీ నిల‌దొక్కుకోవాలంటే అదృష్టం వుండాలి. ల‌క్ వుంటే రాత్రికే రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోవొచ్చు. క‌ల‌ర్ ఫుల్ వ‌ర‌ల్డ్ అయిన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత కాద‌న్న అదృష్టందే పైచేయి. ఆ విధంగా చూస్తే ఇపుడు మ‌ళ‌యాళ బ్యూటీ కేధ‌రిన్ కి అదృష్టం పాలు ఎక్కువనే చెప్పాలి. నిజం చెప్పాలంటే ఈ సుంద‌రి పంట పండిందండి.
వ‌రుణ్ సందేశ్ కి జోడిగా చ‌మ్మక్ ఛ‌ల్లో చిత్రంతో తెలుగు ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించిన ఈ బ్యూటీ ఆ మూవీ సెట్స్ పై వుండ‌గానే కృష్ణవంశీ డైరెక్షన్ లో పైసాలో చాన్స్ కొట్టేసింది. ఇపుడు ఫైసా రిలీజ్ అవుతుండ‌గా ఓ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా కొర‌టాల శివ డైరెక్ట్ చేయ‌నున్న సినిమాలో కేధ‌రిన్ నే క‌ధానాయిక‌గా ఎంచుకున్నార‌ట‌. మొద‌ట శృతిహాస‌న్, కాజ‌ల్, స‌మంత అంటూ ప్రచారం జ‌రిగిన‌ప్పటికీ త‌న అందంతో కేక పెట్టిస్తున్న కేధ‌రిన్ నే హీరోయిన్ నే ఫైన‌లైజ్ చేసేశార‌ట‌.
నిజానికి సైసా ట్రైల‌ర్స్   చూశాక  మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణే త‌న‌కు జోడిగా కేధ‌రిన్ కావాలంటూ డైరెక్టర్ కోరటాల శివ‌కు సూచించాడ‌ట‌. దీంతో కొరటాల వెంట‌నే కేధ‌రిన్ ని బుక్ చేసిన‌ట్టు సమాచారం. ఇక  చూస్తుండ‌గానే టాప్ హీరోయిన్ గా దూసుకువ‌స్తున్న ఈ మ‌ళ‌యాళ అందం వెండితెర‌పై ఇంకా ఏ రేంజ్ లో వెలిగిపోతుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: