క‌థానాయక‌ల్ని అందంగా ఆవిష్క‌రించ‌డంలో కె.రాఘ‌వేంద్ర‌రావు త‌ర‌వాతే ఎవ‌రైనా. ఆయ‌న సినిమాలోని పాట‌లు చూడ‌బుల్‌గా ఉంటాయి. భారీ సెట్టింగులూ లేక‌పోయినా ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయ్‌. అందుకే.. ద‌ర్శ‌కేంద్రుడి సినిమాలోని పాట‌ల్ని ఎన్నిసార్లు చూసినా చూడ‌బుద్దేస్తుంది. ఆయ‌న కొత్త సినిమా ఇంటింటా అన్న‌మ‌య్య‌లోనూ అలాంటి పాట‌లున్నాయ‌ట‌. విష‌య‌మేమంటే కొన్ని పాట‌లకు ఆయనే నృత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించార‌ట‌.  

చిత్ర నిర్మాత య‌ల‌మంచిలి సాయిబాబు మాట్లాడుతూ  ''రాఘ‌వేంద్ర‌రావు విజ‌న్ గొప్ప‌గా ఉంటుంది. పాట‌లో క‌థానాయిక‌ల్ని చూపించే విధానం ఇప్ప‌టికీ కొత్త‌గానే అనిపిస్తుంది. మా సినిమాలోని పాట‌ల‌కు మ‌రో నృత్య ద‌ర్శ‌కుడు అవ‌స‌రం లేక‌పోయాడు. ఆయ‌నే చ‌క్క‌గా రూపొందించారు. అలాగ‌ని స్టెప్పులుండ‌వు. కానీ.. ముచ్చ‌ట‌గా అనిపిస్తాయి. అదే మా పాట‌ల్లోని గొప్ప‌ద‌నం'' అన్నారు. జూన్ మొద‌టి వారంలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: