రామయ్య వస్తావయ్యా టీజర్‌ చూసినవారందరూ ఆ బుడ్డోడు డైలాగ్‌ గురించి చర్చించకుండా ఉండ లేక పోతున్నారట . మొన్న  రాత్రి జరిగిన ఎన్టీఆర్‌ బర్త్‌డే పార్టీలో కూడా అందరూ అదే డైలాగ్‌ గురించి తెగ మాట్లాడుకున్నారట. అయితే ఆ డైలాగును తన ఫ్యామిలీలోని కొంతమందిపై, ఒక మీడియా సంస్థపై ఎక్కుపెట్టాడని ఇప్పటికే చాలా రూమర్లు ఫిలిం నగర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే రామయ్య వస్తావయ్యాలో ఇలాంటి పొలిటికల్‌ డైలాగ్స్‌ ఒక మోతాదులోనే ఉంటాయి కాని, ఆ తరువాత వచ్చే రభస సినిమాలో ఇంత కన్నా రచ్చ రచ్చ చేస్తాయని వార్తలు వస్తున్నాయి.

 ప్రస్తుతం రభసకు సంబందించి పంచ్  డైలాగులను రాసే  పనిలో పడ్డాడు దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌. ఈ సినిమాలో తన ప్రత్యర్ధులందరుకూ తన విశ్వరూపం చూపించాలని ఎన్టీఆర్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.అయితే తన చేతిలో సినిమా ఉంది కదా అని ఇలా డైలాగ్స్ పేల్చు కుంటూపోతే, ఆయనను వ్యతి రేకిం చే వ్యక్తులు  మీడియాలు కూడా ఎన్టీర్ కు ఇలాంటి కోటింగే ఇవ్వాలని స్కెచ్‌ వేస్తారు. ఎన్టీఆర్ చెపుతున్న ఈ పంచ్ డైలాగులుఅతడికి కెరియర్ పరంగా మంచి కన్నా చెడు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు .ఇంత చిన్న వయసులో యంగ్ టైగర్ కు ఇంత అవేశమెందుకో ?

మరింత సమాచారం తెలుసుకోండి: