శ్రియ‌కి టాలీవుడ్‌లో ఇంకా ఆద‌ర‌ణ ఉంద‌న్న‌మాట‌. శ్రియ సినిమా చేస్తే చూడ్డానికి జ‌నాలు సిద్ధంగా ఉన్నార‌న్న‌మాట‌. ప‌విత్ర సినిమాకి జ‌రిగిన బిజినెస్ చూస్తుంటే ఆ విష‌యం అర్త‌మ‌వుతోంది. శ్రియ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం ప‌విత్ర‌. జ‌నార్థ‌న మ‌హ‌ర్షి ద‌ర్శ‌క‌తం వ‌హించారు. ఈ సినిమాకి అన్ని ఏరియాల్లోనూ మంచి వ్యాపారం జ‌రిగిపోయింది. టేబుల్ ప్రాఫిట్ కూడా వ‌చ్చింద‌ట‌. సినిమాకి కోటి రూపాయ‌లు మిగిలింద‌ని ప్రొడ్యూస‌ర్లు  హ్యాపీగా చెబుతున్నారు.

పాపం... ఛార్మి సినిమా కాస్త డ‌ల్‌గా ఉంది. ఆమె కూడా ప్రేమ ఒక‌మైకం సినిమాలో వేశ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మ‌రి ఛార్మి బిజినెస్ ఎప్పుడు మొద‌ల‌వుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: