నృత్య ద‌ర్శ్త‌క‌త్వం నుంచి ట‌ర్న్ అయి, మెగాఫోన్ ప‌ట్టాడు లారెన్స్‌. ద‌ర్శ‌కుడిగా లారెన్స్‌ది విజ‌య‌వంత‌మైన ప్ర‌యాణ‌మే. కాక‌పోతే రెబ‌ల్‌తో అత‌ని ఇమేజ్ దెబ్బ‌తింది. అవ‌స‌రానికి మించి ఎక్కువ ఖ‌ర్చుపెట్టి.. అప్ర‌తిష్ట పాల‌య్యాడు. ఇప్పుడు మ‌ళ్లీ త‌న పూర్వ ప్ర‌తిష్ట‌ను తెచ్చుకోవ‌డానికి క‌సిగా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం ముని 3 తెర‌కెక్కిస్తున్నాడు. దీని త‌ర‌వాత మ‌రో మంచి క‌థ‌తో రావ‌డానికి స‌మాయాత్తం అవుతున్నాడు.

దర్శ‌కుడిగా త‌న‌కు తొలి హిట్ ఇచ్చిన మాస్ సినిమానే న‌మ్ముకొన్నాడు. మాస్‌..ని కొన‌సాగింపుగా మ‌రో చిత్రం తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ నాగ్‌కి క‌థ చెప్పేశాడ‌ట‌. నాగ్ కూడా ఓకే చెప్పేశాడ‌ని స‌మాచారం. ఈ సినిమా సెట్ అయితే... నాగ్‌తో లారెన్స్‌కి హ్యాట్రిక్ సినిమా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: