యువహీరో అల్లు అర్జున్ కు సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు షాక్ ఇచ్చారు. ఈ నెల 24న విడుదల కావాల్సిన అల్లు అర్జున్ నటించిన సినిమా వాయిదా పడి ఈ నెల 31న విడుదల కానుంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమా కూడా అదే రోజున విడుదల కానుంది.

‘శ్రీరామరాజ్యం’ సినిమాను నిర్మించిన యలమంచిలి సాయిబాబా అభిరుచి గల నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడాయన తన కుమారుడు రేవంత్ ను ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న  ఈ సినిమా కోసం అంతా అశక్తిగా ఎదురుచూస్తున్నారు. కె.రాఘవేంద్రరావు ఖాతాలో అనేక సూపర్ హిట్ సినిమాలు ఉండటమే కాకుండా, అతను పరిచయం చేసిన ప్రతీహీరో ఇప్పుడు టాప్ పోజిషన్ లో ఉన్నాడు. దీంతో ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో తమ ఇద్దరమ్మాయిలతో సినిమా రోజునే ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమా విడుదల కావడం అల్లు అర్జున్ వర్గాలను ఆందోళనలో పడవేస్తుంది.

అల్లు అర్జున్ కు కె.రాఘవేంద్ర రావు మహిమ బాగా తెలుసు. అతని దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ సినిమాతోనే హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. దీంతో తన సినిమా విడుదల అవుతున్న రోజునే ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమా విడుదల కావడం అల్లు అర్జున్ ను కలవర పరస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: